సోషల్ మీడియాలో కోతిరాముళ్లు : ట్రోల్స్ పై ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్

by M.Rajitha |
సోషల్ మీడియాలో కోతిరాముళ్లు : ట్రోల్స్ పై ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్ మీడియాలో కొందరు కోతి రాముళ్ళు ఉన్నారని, కొతికి కొబ్బరి చిప్ప దొరికితే గొకా నాకా అన్నట్లుంది వాళ్ళ వ్యవహారం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆ కోతి రాముడు ఎవరో సంధర్భం వచ్చినప్పుడు చెప్తానన్నారు. అది అసలే కోతి, ఆపై కళ్ళు తాగింది అన్నట్లుగా ఇష్టారీతిలో మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీలో చిట్ చాట్ లో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో బరితెగిస్తే మేమేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. ఇటీవల ఎస్సి వర్గీకరణ మీటింగ్ లో సీఎంకి స్వీట్ తినిపించే వీడియోను బిఅరెస్ కార్యకర్తలు ట్రోల్ చేయడం పై స్పందిస్తూ... నా నాయకుడు స్వీటును అంగి కి పూస్తడు.. లుంగి కి పూస్తడు ..మీకేంటి నొప్పి" అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

దళితులు ఈర్ష్య, స్వతంత్రంగా నిలబడితే తట్టుకోలేకపోతున్నారన్నారు. నకిరేకల్ లో పదో తరగతి పేపర్ లీక్ అయితే బ్లేమ్ చేస్తున్నారని, గతంలో లీక్ ల అలవాటు వాళ్లకే ఉందన్నారు. లీక్ లంటే బీఆర్ఎస్ కు పల్లీ బఠానీలకు పేపర్లు అమ్ముకున్నారన్నారు. దమ్ముంటే డైరెక్ట్ గా ఎదుర్కోవాలి తప్ప ఆకాశ రామన్న ఉత్తరాల ద్వారా కాదన్నారు. వాళ్లకు అనుమానాలు ఉంటె సభలో లేవనెత్తోచ్చన్నారు. ఆకాశ రామన్న ముసుగు తీసేసి వస్తే ఎవరి దమ్మేంటో తేల్చుకుందామంటూ హెచ్చరించారు.

Next Story