- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలి
by Sridhar Babu |

X
దిశ, ఆదిలాబాద్ : అన్ని కులమతాలకు ప్రత్యేకంగా నిలిచే మన దేశంలో అన్ని పండుగలు మతాలకతీతంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో స్థానిక రాయల్ పాలేస్ సాత్నాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రెవెన్యూ డివిజనల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కులాలకు మతాలకు భారతదేశం ఒక కేంద్ర బిందువుగా పిలవబడుతుందన్నారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అన్ని మతాలను కులాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అధికారికంగా మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ముస్లింలు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story