శ్రీ కురుమూర్తి స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

by Naveena |
శ్రీ కురుమూర్తి స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
X

దిశ,చిన్న చింతకుంట: తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామిని వేడుకున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం విశ్వ వసు నామ ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ కురుమూర్తి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పండితులు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు పాల్గొన్నారు. వేద పండితులచే పంచాంగ శ్రవణాన్ని విన్నారు. తెలుగు నూతన సంవత్సరంలో రాశుల వారిగా జాతక ఫలాలను వేద పండితులు వివరించారు.

అంతకుముందు కొండ దిగువన దేవస్థాన చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి లు స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్, ముక్కెర వంశీయులు రాజా రాంభూపాల్ లకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వానికి కురుమన్న స్వామి దీవెనలు ఉండాలని కోరారు. ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed