- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Video Viral:భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమా(Social Media)ల్లో చిత్ర విచిత్ర ఘటనలతో పాటు షాకింగ్ ఘటనలను చూస్తూనే ఉన్నాం. కొన్ని ఘటనలు ఫన్నీగా ఉంటే.. కొన్ని ఘటనలు చూస్తే భయం వేయాల్సిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చూస్తే పెద్దలు చెప్పిన ఓ మాట గుర్తొస్తోంది. ఏదైనా ప్రాణపాయ ఆపద నుంచి క్షణాల్లో తప్పించుకున్నట్లయితే భూమ్మీద నూకలు ఉన్నాయని అంటుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర(Maharashtra)లోని విరార్(Virar) ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యక్తికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి. అందుకే భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓ డెలివరీ బాయ్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ డెలివరీ బాయ్ బైక్‌పై వెళుతున్నారు. ఆ సమయంలో వాతావరణంలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి.
ఓ వైపు మెరుపులు, గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ చెట్టు కూలిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ మార్గం గుండా డెలివరీ బాయ్ వెళ్తున్నాడు. ఈ తరుణంలో క్షణాల్లో ఆ చెట్టు కూలిపోవడం గమనించిన అతను తప్పించుకున్నాడు. ఈ దృశ్యాలను అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చెట్టు కొమ్మలు పడటంతో డెలివరీ బాయ్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఏదైమైనా ప్రాణాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.