- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అభివృద్ధి ఫలాలు అందినప్పుడే సామాజిక సమానత్వం

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం అభిప్రాయం వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్ధ శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు పెంచేలా ఉన్నత విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి మాట్లాడుతూ.. ప్రపంచీకరణ,కార్పొరేటీకరణ నేపథ్యంలో సామాజిక అంతరాలు పెరుగుతున్నాయని అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. సదస్సులో చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 60 పరిశోధన పత్రాలు వచ్చాయని సదస్సు కన్వీనర్ డా. శ్రద్ధనందం తెలిపారు. ఈ కార్యక్రమం లో ధరువువు ఎల్లన్న, డా. కే దివ్య పాల్గొని మాట్లాడారు. సదస్సు కు వచ్చిన అతిథులకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి సునీత కృతజ్ఞతలు తెలిపారు. సదస్సులో డా.అనురాధ తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.