- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతు ఐడియా అదుర్స్.. దెబ్బకు కోతులన్నీ పరార్

దిశ, యాచారం : రైతు తన తోటను కాపాడుకోవడానికి చేసిన ఆలోచనతో కోతులన్నీ పరార్ కావడమే కాకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. యాచారం మండల కేంద్రంలోని మొండి గౌరెల్లి, రోడ్డు పక్కన ఉన్న గుత్తేదారు మల్లారెడ్డికి 20 ఎకరాల మామిడి తోట ఉంది. తాను కాలం చేయడంతో తన వారసులు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. తోట బాగా కాపు కాసిందని సంతోషించే లోపే రాత్రింబగళ్లు అనే తేడా లేకుండా కోతులు తోటలపై దాడులు చేస్తూ తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి.. వాటి భారీ నుంచి తోటను కాపాడుకోవడానికి టపాసులను పేల్చిన, దిష్టిబొమ్మలను తోట చుట్టూ పెట్టిన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో చివరకు భిన్నంగా ఆలోచించారు. కొండెంగలతో కోతుల బెడద తప్పుతుందని మామిడి తోట చుట్టూ కొండెంగల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో అటు వైపు చూడాలంటేనే కోతులు భయం తో వణికి పోతున్నాయి. వాటి బెడద తప్పడంతో పాటు అటువైపు నుంచి వెళ్లేవారు కొండెంగల ఫ్లెక్సీలను ఆశ్చర్యంగా చూస్తూ రైతును మెచ్చుకుంటున్నారు.