- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వక్ఫ్బిల్లుకు చట్టబద్దత కల్పించడం హర్షనీయం : ఎంపీ డి.కె. అరుణ

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం వక్ఫ్ బిల్లుకు చట్టబద్దత కల్పించడంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ హర్షం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో మరువలేని కీలక ఘట్టమని, మోడీ ప్రభుత్వం చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించుకుందని తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ వక్ప్ సవరణ బిల్లుకు శ్రీరామ నవమి రోజునే చట్టబద్దత కల్పించడం శుభతరుణమని దేశంలోని వేలాది మంది వక్ఫ్ బాధితులకు న్యాయం జరగబోతోందన్నారు. దేశంలో వక్ఫ్ పేరుతో వివాదంలో ఉన్న వేల ఎకరాల భూములుకు ఉపశమనం లభిస్తుందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింల ఆస్తులు, మసీదులు, కబరస్తాన్‌లు తీసుకుంటారని జరిగిన ప్రచారం అవాస్తవమని, ఇలాంటి ఏమి జరగదని ఇప్పటికైనా ముస్లిం సోదరులు, ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు.
వక్ఫ్ పేరుతో జరిగిన మోసాలకు ఈ చట్టంతో ముక్కుతాడు పడిందని, అందరికీ న్యాయం చేసేందుకే ఈబిల్లు తీసుకొచ్చినట్లు చెప్పారు. బోర్డు ఏర్పాటు ఉద్దేశ్యం ఏళ్లు గడిచిన నెరవేరలేదని ఇక నుంచి అసలైన ముస్లిం మహిళలు, వితంతువులకు న్యాయం జరగనుందన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదం తెలపడం హర్షనీయమన్నారు. బిల్లు చట్టం రూపంలో తీసుకురావడంలో ప్రత్యేక కృషి చేసిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, మైనారిటీ శాఖ మంత్రి కిరన్ రిజిజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.