- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తల్లితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉందని మూడేళ్ల పాపకు వాతలు

దిశ, వెబ్ డెస్క్: మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. తన స్వార్థం కోసం ఎంతటి ఘోరానికైనా వెనకడుగు వేయడం లేదు. అవసరమైతే మనుషులను చంపి జైలుకైనా వెళుతున్నారు తప్ప తప్పు, మంచి అనే ఆలోచనే చేయడంలేదు. తాజాగా జరిగిన ఈ ఘోర ఘటన అసహ్యం కలిగిస్తోంది. విజయవాడ వైఎస్సార్ కాలనీ(Vijayawada YSR Colony)లో భర్తతో విడిపోయిన మహిళ తన మూడేళ్ల కూతురితో కలిసి ఉంటోంది. అయితే స్థానికంగా ఉండే శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం(Extramarital Affair) పెట్టుకున్నారు. ఈ జంట కొన్ని రోజులు హైదరాబాద్(Hyderabad)లో ఉన్నారు.
అయితే వీరి వివాహేతర సంబంధానికి పాప అడ్డుగా ఉందని శ్రీరాములు(Sriramulu) కక్ష గట్టాడు. తల్లి(Mother)తో కలిసి పాపకు రోజూ నరకం చూపించడం మొదలు పెట్టారు. ఒంటిపై వాతలు పెట్టడం, విచక్షణా రహితంగా కొట్టడం లాంటివి చేశారు. ఈ విషయం శ్రీరాములు తల్లికి తెలియడంతో పాపను తీసుకొని ఆమె హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోయారు. అయితే శ్రీరాములు, పాప తల్లి కూడా విజయవాడకు వెళ్లారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల పాపకు నరకం చూపించిన శ్రీరాములు, తల్లిని శిక్షించాలని, పోలీసులు కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.