- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Jd vance: మోడీని చూస్తే నాకు అసూయ.. జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (Jd vance) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) పై ప్రశంసల వర్షం కురిపించాడు. మోడీ కఠినమైన సంధానకర్త అని కొనియాడారు. ఆయన భారత్ కోసం ఎంతో శ్రమిస్తారని, ఎంతో కఠినమైన ఒప్పందాలు చేస్తారని తెలిపారు. మంగళవారం ఆయన జైపూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. భారత పరిశ్రమ అభివృద్ధికి మోడీ నిరంతరం ఫైట్ చేస్తున్నారని, తమ దేశ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎలా పోరాడుతున్నారో స్వయంగా చూశానని ప్రశంసించారు. మోడీకి ఎంతో ప్రజాధరణ ఉందని ఆయన రేటింగ్ లను చూసి అసూయపడుతున్నానని వ్యాఖ్యానించారు. అమెరికాలోనూ మోడీకి అత్యంత గౌరవం లభిస్తుందని నొక్కి చెప్పారు.
భారత్, అమెరికాల అభివృద్ధే ట్రంప్ లక్ష్యం
అమెరికా, భారత్‌లు రెండూ అభివృద్ధి చెందాలని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా సానుకూల భాగస్వామ్యం ఏర్పడుతుందన్నారు. ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాల కోసం నిబంధనలు ఖరారు చేశామని, ట్రేడ్ డీల్స్ న్యాయబద్ధతపై ఆధారపడి ఉండాలన్నారు. ‘మా పరిపాలన న్యాయంగా, ఉమ్మడి జాతీయ ప్రయోజనాల ఆధారంగా వాణిజ్య భాగస్వాములను కోరుకుంటుంది. ఎగుమతులను పెంచడానికి వారి వేతనాలను అణచివేయకుండా.. శ్రమ విలువను గౌరవించే మా విదేశీ భాగస్వాములతో మేం సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పారు. అమెరికాతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్న భాగస్వామ్యులనే కోరుకుంటున్నామన్నారు. అమెరికా, భారత్‌ల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ట్రంప్ తన మిత్రదేశాలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. రక్షణ విషయంలో ఇరు దేశాలు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు.
నాన్నా నేను ఇండియాలో ఉండొచ్చు కదా!
మోడీతో భేటీ అనంతరం తన కుమారుడు ఇవాన్ తాను భారత్‌లో నివాసిస్తానని నాతో చెప్పాడని వాన్స్ తెలిపారు. ‘ప్రధాని విందు తర్వాత నా కొడుకు ఇవాన్ నా దగ్గరకు వచ్చి నాన్న బహుశా నేను భారత్‌లో నివసించొచ్చు కదా? అని అడిగాడు. కానీ జైపూర్ కు వచ్చిన వెంటనే తన మనసు మార్చుకున్నాడు. గ్రేట్ ప్యాలెస్ తో 90 నిమిషాలు వేడిలో గడిపాక ఇంగ్లాండ్‌కు వెళ్లాలని చెప్పాడు’ అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్క సారిగా నవ్వులు విరబూశాయి.