- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరోసారి భూకంపం.. ప్రాణాలు చేతిలో పట్టుకొని పరుగులు తీసిన ప్రజలు

దిశ, వెబ్ డెస్క్: మయన్మార్ లో భారీ తీవ్రతతో వచ్చిన భూకంపం (Earthquake) కారణంగా ఇప్పటి వరకు 1600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన మరువక ముందే మరోసారి మాండలే (Mandalay) సమీపంలో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే నివేదించింది. ఈ తాజా భూకంపం సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో నేలపై ఉన్న ఓ కుంటలో నీరు.. కుదుపులకు లోనవ్వడం స్పష్టంగా కనిపించింది.
దీంతో ప్రాణభయంతో ప్రజలు భవనాల నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. కాగా ఈ ఆఫ్టర్‌షాక్ (Aftershock) వల్ల జరిగిన నష్టం, మరణాల గురించి ఎటువంటి సమాచారం అందలేదు. కానీ ఇది ఇప్పటికే భారీ భూకంపంతో.. భయాందోళనలో ఉన్న ప్రజలను ఇది మరింత భయపెట్టింది. మయన్మార్‌లో మార్చి 28న సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు (Richter scale)పై 7.7గా నమోదైంది. దీని కేంద్రం మాండలే సమీపంలో ఉండగా.. ఈ ఘటనలో 1,600 మందికి పైగా మరణించారు. 3,400 మందికి పైగా గాయపడ్డారు. 139 మంది కనిపించకుండా పోయారని అధికారిక నివేదికలు చెబుతున్నాయి.