వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మరిన్ని జట్లు?

by John Kora |
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మరిన్ని జట్లు?
X

- ప్రస్తుతం ఉన్న 5 జట్లను పెంచుతారా?

- బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకోబోతోంది?

- సెక్రటరీ అరుణ్ ధుమాల్ ఏమన్నారు?

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ సక్సెస్ సాధించడంతో బీసీసీఐ మహిళల కోసం ప్రత్యేకంగా మరో లీగ్‌ను ఏర్పాటు చేసింది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కూడా అద్బుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లు ఉండగా.. లీగ్ ప్రారంభంలోనే మూడేళ్ల తర్వాత ఇందులోని మరిన్ని జట్లను తీసుకొని వస్తామని బీసీసీఐ చెప్పింది. డబ్ల్యూపీఎల్ సక్సెస్ అయితే లీగ్‌లోని జట్ల సంఖ్యను ఐదు నుంచి మరింతగా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ కూడా అప్పట్లో వ్యాఖ్యానించింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలోని డబ్ల్యూపీఎల్ కమిటీ మూడు సీజన్ల తర్వాత జట్ల సంఖ్యను పెంచాలని ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. అయితే ఇప్పుడు మూడు సీజన్లు ముగియడంతో డబ్ల్యూపీఎల్ జట్ల సంఖ్య పెంపుపై చర్చ మొదలైంది.

కాగా, వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జట్ల సంఖ్యను మరింతగా పెంచడానికి బీసీసీఐ సిద్ధంగానే ఉంది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు ప్రారంభం కాబోదని బోర్డు కార్యదర్శి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. తాజాగా ముగిసిన డబ్ల్యూపీఎల్ సక్సెస్ అయ్యింది. స్టేడియంలో ప్రేక్షకుల పరంగా, ట్రాన్షాక్షన్ పరంగా చాలా అభివృద్ధి సాధించాము. ప్రసారాల్లో కూడా టీఆర్పీలు పెరిగాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మహిళా క్రికెటర్లకు డబ్ల్యూపీఎల్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అరుణ్ దుమాల్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని కూడా భావిస్తున్నట్లు ధుమాన్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు లీగ్‌లో జట్ల సంఖ్యను మాత్రం పెంచే ఉద్దేశం లేదని అన్నారు.

డబ్ల్యూపీఎల్ మీడియా హక్కులను రూ.951 కోట్లకు బీసీసీఐ అమ్మింది. దీంతో ఇది ప్రపంచంలోనే రెండో పెద్ద మహిళా లీగ్‌గా రికార్డులు సృష్టించింది.

Next Story

Most Viewed