- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యులు సమయపాలన పాటించాలి
దిశ, కోరుట్ల : రోగుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, మందుల కొరత లేకుండా చూడాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కోరుట్ల, మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రులను బుధవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు.
రోగులకు పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ను పరిశీలించి టీకా కోసం వచ్చిన వారికి సరైన పద్ధతిలో ఇస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెడికల్ లో రోగులకు ఇచ్చే మాత్రలు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రోగుల దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్ పల్లి లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో నూతన భవన నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి విషయాన్ని చర్చించినప్పటికి ఎలాంటి స్పందన లేదని విచారం వ్యక్తం చేశారు.