- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ నేరగాళ్ల ఖాతాల నుంచి బాధితుల ఖాతాల్లోకి ఛీటింగ్ నగదు..
దిశ, సిటీ క్రైమ్ : పెట్టుబడులతో భారీ లాభాలు, పార్ట్ టైం జాబ్ తో లక్షలు సంపాదించండి అంటూ ఇద్దరు మహిళలను బురిడీ కొట్టించి లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్ల ఖాతాల నుంచి బాధితుల ఖాతాలకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు రప్పించారు. దీంతో బాధితులకు కొంత ఆర్థిక ఊరట లభించింది. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు మహిళలకు ఇటీవల వాట్సాప్ కాల్స్ ద్వారా ఫోన్ చేసి మీకు పార్ట్ టైం జాబ్ ఆఫర్ ఉందని, అందులో చేరి మీరు ఇంటి దగ్గర ఉంటూ లక్షలు సంపాదించవచ్చని మాయ చేశారు. అదే విధంగా పెట్టుబడులతో మీకు భారీ లాభాలు వచ్చేలా మేము చిట్కాలు చెప్పుతామని నమ్మించారు.
ఇలా ఒకరి దగ్గర నుంచి 4.22 లక్షలు, మరొకరు దగ్గర నుంచి 7.65 లక్షలు కొట్టేశారు. ఇంకా డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు వేగంగా స్పందించి బ్యాంక్ అధికారులకు లేఖలు రాసి సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో నగదును ముందుగా జప్తు చేయించారు. ఆ తర్వాత కోర్టు అనుమతి తో వాటిని తిరిగి బాధితుల ఖాతాల్లోకి మొత్తం 8.22 లక్షల నగదును వాపస్ వచ్చేలా చేశారు. గూగుల్ టాస్క్ రేటింగ్ క్లిక్ అండ్ రేట్, వంటి ఆకర్షించే ప్రకటనలతో వర్క్ ఫ్రమ్ హోం జాబ్ ఆఫర్ లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సోషల్ మీడియాల వేదికగా వస్తే అది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల చీటింగ్ అని అనుమానించాలి. అదే విధంగా పెట్టుబడులతో లాభాలంటూ ముందుగా నమ్మించేందుకు కొంత పెట్టుబడికి చిన్న చిన్న ఆదాయాలు ఇస్తే వాటిని అసలు నమ్మోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.