- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Robert Vadra: భవిష్యత్‌లో ఎన్నికల బరిలో దిగుతా.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: క్రియాశీల రాజకీయాల్లోకి రావడంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా(Robert Vadra) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మార్పు చేయగలనని ప్రజల భావిస్తే భవిష్యత్తులో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బుధవారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. ‘నేను ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేస్తున్నా. నిరంతరం ప్రజల మధ్యే ఉంటా. నేను మార్పు చేయగలనని ప్రజలు భావిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తా’ అని వ్యాఖ్యానించారు. ప్రియాంకను భారీ మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె పార్టీని మరింత బలోపేతం చేస్తుందని, లోక్ సభలో రాహుల్‌కు సహాయం చేస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. హర్యానా, మహారాష్ట్ర పరాజయాల తర్వాత కాంగ్రెస్ వాస్తవ పరిస్థితులను బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై దేశ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం రాబర్ట్ సుముఖత వ్యక్తం చేశారు. అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. దీనికి సంబంధించిన పోస్టర్లు సైతం వెలిశాయి. అయితే ఆ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగలేదు.