ఒకే కాన్సెప్ట్‌తో రాబోతున్న రెండు పాన్ ఇండియా సినిమాలు.. షాక్‌లో నెటిజన్లు?

by Hamsa |
ఒకే కాన్సెప్ట్‌తో రాబోతున్న రెండు పాన్ ఇండియా సినిమాలు.. షాక్‌లో నెటిజన్లు?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు తెలుగు మూవీస్‌లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయాడు. ఇక ‘హనుమాన్’(Hanuman)మూవీతో ఘన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టడంతో తేజకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఈ సినిమాతో ఆయన రేంజ్ మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం జై హనుమాన్, మిరాయ్ వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ‘మిరాయ్’(Mirai) సినిమాను కార్తిక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) తెరకెక్కిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

అయితే ఇందులో తేజ సజ్జా సరసన రితిక నాయక్(Ritika Nayak) హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఆగస్టు 1న 2D, 3D ఫార్మెట్‌లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాను రక్షాబంధన్, ఇండిపెండెన్స్ డేను టార్గెట్ చేస్తూ విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ‘మిరాయ్’ నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ‘మిరాయ్’లో టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. అయితే మిరాయ్, SSMB-29 ఒకే కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఇక అదే కనుక జరిగితే మహేష్ బాబు, తేజ సజ్జా పని అయిపోయినట్లే. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు వీరిద్దరి కెరీర్‌పై బాగానే ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Next Story