Summer Effect : భానుడి భగ భగలు.. వడదెబ్బకు గురి కాకూడదంటే..?

by Javid Pasha |
Summer Effect : భానుడి భగ భగలు.. వడదెబ్బకు గురి కాకూడదంటే..?
X

దిశ, ఫీచర్స్ : ఎండలు మండుతున్నాయ్.. బయట తిరిగేవారైతే భానుడి భగ భగలతో అవస్థలు పడుతున్నారు. అయితే ఇటువంటప్పుడు శరీరం డీహైడ్రేషన్‌(Dehydration)కు గురికావడం, వడ దెబ్బ తగలడం వంటివి సంభవిస్తాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాంతకం కావచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.

అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు ఎండపూట బయట తిరగకపోవడం మంచిది. అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే తగినంత నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారంగా మన శరీరంలో 65 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. అయితే వయస్సు రీత్యా ఈ పరిమాణంలో కూడా మార్పులు కూడా ఉంటాయి.

మధ్య వయస్కులైతే తమ శరీరంలో కనీసం 65 శాతం, వృద్ధుల్లో 50 శాతం, పిల్లల్లో 80 శాతం ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు వివిధ వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఒకవేళ నీటిశాతం తీవ్రంగా పడిపోతే డీహైడ్రేషన్‌కు, వడదెబ్బ(Heat strok)కు గురవుతారు. అలా జరగకూడదంటే ప్రతి రోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని, వేసవిలో 3 నుంచి 4 లీటర్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed