ఆ భూమిపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయ్.. మంత్రి జూపల్లి కృష్ణారావు

by Shiva |   ( Updated:2025-04-02 09:18:03.0  )
ఆ భూమిపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయ్.. మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ, వెబ్‌డెస్క్: హెచ్‌సీయూ (HCU) నుంచి తాము ఒక్క ఇంచు భూమిని కూడా తీసుకోలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి (Kanche Gachibowli)లోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University)కి సంబంధించింది కాదని తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థ చెరలో ఉన్న భూమిని ప్రభుత్వం న్యాయస్థానంలో కోట్లాడి తిరిగి స్వాధీనం చేసుకుందని అన్నారు. హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ విద్యార్థల అపోహలు, ఆ భూమికి సంబంధించిన అనుమానాలకు తోడు అక్కడ గందరగోళం సృష్టించేందుకు కొన్ని శక్తులు బలంగా ప్రయత్నిస్తున్నారని కామెంట్ చేశారు. వర్సిటీ నుంచి ఇంచు భూమి కూడా తాము తీసుకోలేదని అన్నారు. దశాబ్దాల నుంచి హైదరాబాద్‌ (Hyderabad)లో కబ్జాకు గురవుతోన్న చెరువులను పునరుద్ధరణ చేస్తున్నామని.. అలాంటప్పుడు తమకు హెచ్‌సీయూ (HCU) భూములను తీసుకోవాల్సి అవసరం ఏంటని ప్రశ్నించారు. కేవలం విద్యార్థులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

Next Story

Most Viewed