Trump: టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు.. ట్రంప్ మరో కీలక ప్రకటన

by vinod kumar |
Trump: టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు.. ట్రంప్ మరో కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: సుంకాలపై 90 రోజుల విరామం ఉన్నప్పటికీ టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు ఉండబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు. ఎలాంటి సుంకాల రాయితీలు తాను ప్రకటించలేదని తెలిపారు. ‘ఇతర దేశాలు అమెరికాతో అన్యాయమైన వాణిజ్య పద్దుతులు అవలంభించాయి. ఇష్టారీతిన సుంకాలు విధించాయి. కాబట్టి సుంకాల మినహాయింపు ఏ దేశంపై ఉండదు. ముఖ్యంగా చైనా విషయంలో ఈ డిసిషన్ మరింత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దేశం యూఎస్ తో దారుణంగా ప్రవర్తించింది’ అని తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.

రాబోయే జాతీయ భద్రతా సుంకాల దర్యాప్తులో సెమీకండక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్స్ సరఫరాలపై దృష్టి సారించామని తెలిపారు. దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయగలమని తమ దర్యాప్తులో తేలింది, కాబట్టి ఈ వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడే చైనా చేతిలో బంధీలుగా మారకుండా ఉంటాం అని వెల్లడించారు. అమెరికా కొత్త స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోందని, ఇందులో పన్ను తగ్గింపులు, నిబంధనల సడలింపు ఉన్నాయన్నారు. వీటిలో చాలా వరకు ఇటీవల ఆమోదించబడ్డాయని తెలిపారు.



Next Story

Most Viewed