- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘తన్వి ది గ్రేట్’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. ఆసక్తిని పెంచుతున్న అనుపమ్ ఖేర్ పోస్ట్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్(Anupam Kher) ఏకంగా 500 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఇటీవల కంగనా రానౌత్ ‘ఎమర్జెన్సీ’చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘తన్వి ది గ్రేట్’. అయితే ఈ సినిమాను అనుపమ్‌ఖేర్ స్టూడియోస్, ఎన్‌ఎఫ్‌డిసి బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతుండగా.. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. అలాగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈచిత్రాన్ని ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. అయితే ఇటీవల ఓ వీడియోను షేర్ చేసి క్యూరియాసిటినీ పెంచేశారు. తాజాగా, చిత్రబృందం ‘తన్వి ది గ్రేట్’ ప్రధాన పాత్రలో నటిస్తున్న నటి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) చేతుల మీదుగా విడుదల చేయించారు. అయితే ఇందులో శుభంగి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ వీడియోను కూడాషేర్ చేశారు.
ఇందులో ఆమె జీవితంలో ఏదో కోల్పోయి బాధలో ఉన్నట్లు చూపించారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘TanviTheGreat సినిమా చేయాలనే ఆలోచన దాదాపు 4 సంవత్సరాల క్రితం నిజ జీవిత సంభాషణ నుండి నాకు వచ్చింది. దానిని కలపడానికి నాకు మా బృందానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. నా యాక్టింగ్ స్కూల్ @actorprepares నుండి Tanviని నేను కనుగొన్నాను. కానీ తన్విని వెతకడం చాలా కష్టమైన పని! ఎందుకంటే తన్వి మంచితనం, అమాయకత్వం, ఆకర్షణ, అద్భుత భావం, హాస్యం, స్వచ్ఛతను సూచిస్తుంది! తన్వి భిన్నమైనది కానీ తక్కువ కాదు! ఆమెను కనుగొనడానికి మాకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది! ఒకరోజు స్కూల్‌లో నా మాస్టర్ క్లాస్‌లో నేను విద్యార్థులను కళ్ళు మూసుకుని, వారి ముఖాల్లో పూర్తిగా ప్రశాంతతో కలిగి ఉండమని అడిగాను. శుభంగి(Shubhangi) కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ముఖం అంతా ప్రశాంతంగా ఉండడం చూశాను.
తర్వాత ఆమె మాకు చెప్పింది, వాస్తవానికి ఆమె తన భద్రతా దుప్పటి అయిన కలలో ఉంది. నేను అన్ని వివరాలను తర్వాత చెప్తాను. కానీ ఈ రోజు నా ప్రియమైన శుభంగి మీరు ప్రపంచాన్ని కలుస్తారు. మీ కలల ప్రపంచం. అయితే తన్వీ లక్షణాలను ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లండి. ఆమె మిమ్మల్ని వాస్తవికంగా, స్థిరంగా ఉంచుతుంది! కాబట్టి కష్టపడి పని చేయండి, నిజాయితీగా ఉండండి, నిజముగా ఉండండి. ప్రపంచం మిమ్మల్ని #ShubhangiTheGreat అని పేర్కొనడం ప్రారంభించినప్పుడు ఇది వ్యక్తిగతంగా నాకు పాఠశాలకు సంతోషకరమైన రోజు అవుతుంది. నా ప్రేమ ఆశీర్వాదం! సినిమా చూసినప్పుడే ప్రపంచం నిర్ణయిస్తుంది. కానీ మీ దర్శకుడి కోసం #TanviTheGreatలో మీరు మాయాజాలం అని ఈరోజు ప్రకటిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. అయితే ఈ సినిమాతోనే శుభంగి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె అనుపమ్ ఖేర్‌కు సంబంధించిన స్కూల్‌లో యాక్టింగ్ నేర్చుకోగా.. ఇప్పుడు హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు.