Indian Army : సియాచిన్ గ్లేసియర్ పై ఆర్మీ కీలక నిర్ణయం

by M.Rajitha |
Indian Army : సియాచిన్ గ్లేసియర్ పై ఆర్మీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : సియాచిన్ గ్లేసియర్ పై భారత ఆర్మీ(Indian Army) కీలక నిర్ణయం వెలువరించింది. ఇకపై సియాచిన్(Siachen) యుద్ధభూమి సందర్శనకు పర్యాటకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే కార్గిల్(Kargil), గల్వాన్(Galwan) లోయలోకి కూడా సందర్శకులకు అనుమతి ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) వెల్లడించారు. పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జమ్ము కాశ్మీర్లో పర్యటకాన్ని మరింత పోషించేందుకు 48 ప్రత్యేక ప్రాంతాలను ఎంపిక చేశాం. అలాగే ఇకపై సియాచిన్, కార్గిల్, గల్వాన్ వంటి యుద్ధభూమిని చూసేందుకు పర్యాటకులకు అనుమతిస్తామని, అయితే ఇందుకోసం ముందుగా టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. సియాచిన్ ప్రపంచంలోనే అతి ఎత్తైన వార్ ఫీల్డ్. కార్గిల్.. 1999లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగిన స్థలం. ఇవి రెండూ లద్దాఖ్ లో ఉండగా.. గల్వాన్.. 2020లో భారత్-చైనా మధ్య ఘర్షణలు జరిగిన ప్రదేశం.

Advertisement

Next Story

Most Viewed