- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
LAC: ఎల్‌ఏసీ వెంబడి 1,637 కిలోమీటర్ల హైవే.. రూ.28,229 కోట్లు కేటాయించిన కేంద్రం
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-చైనా అంతర్జాతీయ సరిహద్దులో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి అరుణాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాలను కలుపుతూ 1,637 కిలోమీటర్ల ఫ్రాంటియర్ హైవే నిర్మాణానికి కేంద్రం రూ.28,229 కోట్లు మంజూరు చేసినట్టు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ హెడ్ సుభాష్ చంద్ర లూనియా తెలిపారు. రూ. 40,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి, సరిహద్దు రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడుడుతుందని పేర్కొన్నారు. ఇది బోమ్‌డిలా నుంచి ప్రారంభమై నఫ్రా, హురి, మోనిగాంగ్ పట్టణాల గుండా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇవి ఏల్ఏసీ, మెక్‌మోహన్ రేఖకు దగ్గరగా ఉంటాయి. భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగర్‌లో ఇది ఇది ఎండ్ కానుంది. 2027 నాటికి దీని పనులు పూర్తవుతాయని లూనియా తెలిపారు. 2014 తర్వాత, వివిధ రాష్ట్రాల్లో రహదారుల అభివృద్ధి, నిర్వహణకు బడ్జెట్ రెట్టింపు చేశారని చెప్పారు.