Walk out: జేపీసీ గడువు పొడిగించాలి.. వక్ఫ్ సమావేశం నుంచి ప్రతిపక్ష నేతల వాకౌట్

by vinod kumar |
Walk out: జేపీసీ గడువు పొడిగించాలి.. వక్ఫ్ సమావేశం నుంచి ప్రతిపక్ష నేతల వాకౌట్
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లు(Waqf bill) పై చర్చించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) ఎనిమిదో సమావేశం బుధవారం నిర్వహించారు. అయితే కమిటీ పదవీ కాలాన్ని పొడించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు మీటింగ్‌ను బహిష్కరించారు. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ (JagadhambikaPaul) నవంబర్ 29 గడువులోగా ప్రక్రియను ముగించాలనుకుంటున్నారని, అనేక రాష్ట్ర బోర్డులు ఇంకా ప్యానెల్ ముందు హాజరుకాలేదని కాబట్టి గడువు పొడిగించాలని కోరారు. ముసాయిదా నివేదికపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay singh) మీడియాతో మాట్లాడుతూ.. వివిధ ప్రతినిధులు, బోర్డులతో జేపీసీ అభిప్రాయాల స్వీకరణ పూర్తి కాకముందే ముసాయిదాను సమర్పించడం సరికాదని ఫైర్ అయ్యారు. జేపీసీ గడువు పెంచుతామని స్పీకర్ హామీ ఇచ్చారని అయినప్పటికీ ముసాయిదా నివేదికను సిద్ధం చేస్తామని చైర్మన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ (Kalyan benarjee) మాట్లాడుతూ.. బీజేపీకి అనుకూలంగా ఉన్నవారి సలహాలు సూచనలు మాత్రమే తీసుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీతో సహా అత్యధిక వక్ఫ్ ఆస్తులు ఉన్న రాష్ట్రాలను సమావేశాలకు పిలవలేదన్నారు. వక్ఫ్ ఆస్తి కోసమే ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఏడుగురు వ్యక్తులు మరణించారని, ఈ విషయాలను సీరియస్ గా తీసుకోవడం లేదని మండిపడ్డారు. సమావేశం నుంచి వాకౌట్ చేసిన వారిలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ఎంపీ రాజాలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed