- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘విరాట్ కోహ్లీ సతీమణి అంటే నాకెంతో ఇష్టం’.. టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు వరుస సినిమాల్లో అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde). ఈ బ్యూటీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. కానీ తర్వాత పూజా హెగ్డేకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ బుట్టబొమ్మ ప్రజెంట్ స్క్రిప్ట్‌ల ఎంపికల విషయంలో ఆచితూచి అడుగువేస్తుంది. అయితే ఈ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్యూకు హాజరై.. పలు విషయాలు పంచుకుంది.
సినీ పరిశ్రమలో పురుషాధిక్యంపై ఈమె ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. మీతో నటించిన నటులతో ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అని ప్రశ్న ఎదురవ్వగా.. ఈ సమస్య అన్నీ ఇండస్ట్రీల్లోనూ ఉందని తెలిపింది. అలాగే ఒక్కో దగ్గర ఒక్కోలాగా ఉంటుందని.. సిచ్యూవేషన్స్ బట్టి స్థాయిలు కూడా మారిపోతాయని ఈ నటి వెల్లడించింది. బరువైన కాస్ట్యూమ్స్, అలాగే పెద్ద పెద్ద లెహంగాలు వేసుకుని సెట్ వరకు నడుచుకుంటూ వెళ్లాలని, పలుమార్లు అది చూడానికి బాగానే ఉంటుందని తెలిపింది.
కానీ అంత బరువన బట్టల్ని ధరించి.. ఈడ్చుకుంటూ వెళ్లడం, మళ్లీ షాట్ కంప్లీట్ అయ్యాక అలాగే వెళ్లాలని.. ఇది కూడా ఒక రకమైన వివక్షేనంటూ పూజా చెప్పుకొచ్చింది. ప్రేమకథ ఉన్న చిత్రాల్లో నటించిన ఎలాంటి గుర్తింపు ఉండదని.. కొన్నిసార్లు పోస్టర్‌లో మా పేరు కూడా ఇవ్వరని పేర్కొంది. ఇక అనుష్క శర్మ అంటే చాలా ఇష్టమని తెలిపింది.
తన వ్యక్తిత్వానికి నేను దగ్గరగా ఉంటానని..అప్పట్లో అనుష్కకు కూడా పెద్దగా సపోర్ట్ లేదని తెలిపింది. తనలాగే నాకు కూడా పార్టీలకు వెళ్లడం నచ్చదని, కాగా నాలాంటి వారు ఒక్కరున్నందుకు హ్యాపీగా అనిపిస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.