- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sankranthiki Vasthunnam: ఓటీటీలో అదరగొడుతున్న వెంకీ మామ మూవీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కడంతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
కళ్లు చెదిరే వసూళ్లతో ఈ చిత్రం వెంకీమామ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే మార్చి 1నుంచి ఈ చిత్రం ఓటీటీ(OTT) స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రీమియర్(Television Primer)లో వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు టెలివిజన్ ప్రీమియర్‌లో ఏకంగా 18.1 టీవీఆర్ దక్కగా.. తాజాగా మరో రికార్డు సాధించింది ఈ మూవీ.
ఇప్పటి వరకు 400M+ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదైనట్లు మేకర్స్ వెల్లడించారు. రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రిలీజ్ అయి మూడు నెలలు దాటుతున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.