- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
130 మంది మైనర్లకు శిక్షణ ఇచ్చాను.. సంచలనంగా మారిన మావోయిస్ట్ సుధాకర్ లేఖ

దిశ, భద్రాచలం : ఐఈడీ బాంబుల తయారు చేయడం, వెపన్స్ వాడడంలో 130 మంది మైనర్లకు శిక్షణ ఇచ్చానని మావోయిస్టు అగ్రనేత సుధాకర్ వద్ద పోలీసులకు దొరికిన లేఖ సంచలనంగా మారింది.బీజాపూర్ జిల్లా సరిహద్దులో మూడు రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేత సుధాకర్ అలియాస్ మురళీ అలియాస్ సారయ్య తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుండి ఆయుధాలతో పాటు సుధాకర్ జేబులో దొరికిన లేఖ పోలీసు యంత్రాంగాన్ని నివ్వెరపోయేలా చేసింది. 9 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు 40 మంది,14 నుంచి 17 ఏండ్ల లోపు వారు 40 మంది, 18 నుంచి 22 సంవత్సరాల లోపు వారిని రిక్రూట్ చేసుకుని యుద్ధ మెలుకవులు తో పాటు ఐఈడీ తయారీ, వెపన్స్ ఉపయోగించడం లాంటి వాటిలో శిక్షణ ఇచ్చినట్లు ఆ లేఖలో ఉంది.సుధాకర్ ఈ విధమైన శిక్షణ ఇవ్వడంలో నిష్ణాతుడు. సుధాకర్ ఎన్కౌంటర్ లో మృతి చెందాక అతని వద్ద లేఖ దొరికిందని పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ లేఖ సుధాకర్ ఎవరికి రాసాడు..? కేంద్ర కమిటీ కి పంపడానికేనా..? అనేది స్పష్టత రావాల్సి ఉంది. అసలు ఆ లేఖ మావోయిస్టు సుధాకర్ దగ్గరే దొరికిందా..? మావోయిస్టు పార్టీ ఫై పోలీసులు దుష్ప్రచారం చేయడానికి పోలీసులు సృష్టించారా..? అనే సందేహాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులు స్పందిస్తే తప్ప నిజం తెలిసే అవకాశం లేదు.