ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ 35 రోజులుగా.. చివరి ఆ 200 మీటర్లు డేంజర్ జోన్

by Aamani |
ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ  ఆపరేషన్ 35 రోజులుగా.. చివరి ఆ 200 మీటర్లు డేంజర్ జోన్
X

దిశ, అచ్చంపేట : SLBC వద్దా ప్రమాదకరమైన చోటుచేసుకుని గురువారం నాటికి 35 రోజులగా నిరంతరాయంగా సహాయక చర్యల కోసం రెస్క్యూ బృందాలు కృషి చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 8 మంది మృతిచెందగా వారిలో ఇద్దరిని మాత్రమే ఇప్పటివరకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించి వెలికి తీశారు. మిగిలిన 6 మంది కోసం తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఎస్ఎల్బీసీ వద్ద జరుగుతున్న సహాయక చర్యలపై ఈనెల 25న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ భవనంలో రివ్యూ చేసి మిగిలిన వారిని గుర్తించే వరకు ఏమాత్రం నిమ్మరపాటు లేకుండా సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని.. అదే క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న వారికి ఎలాంటి ఆపద ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని అధికారులను సీఎం హెచ్చరించడంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది.

ఆ 200 మీటర్లు అతి డేంజర్ జోన్ గా...

SLBC సొరంగంలోని 13.5 కిలోమీటర్ల తదుపరి ప్రదేశం ప్రమాదం జరిగిన 14 కిలోమీటర్ నుండి ఆ 200 మీటర్ల ముందు భాగం అతి డేంజర్ జోనుగా అధికారులు అరెస్టు బృందాల ప్రతినిధులు గుర్తించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు బురద మట్టి నీరు ఇతర టీబీటీ మిషన్ శకలాలు తొలగించడంలో పూర్తిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఆ రెండు డెడ్ బాడీలో గుర్తించడంలో రెస్క్యూ బృందాలు సాహసాన్ని మించి శ్రమించి అతి జాగ్రత్తగా వాటిని వెలికి తీశారు. ప్రమాద స్థలం అతి సమీపంలో సుమారు 200 మీటర్ల దూరం అత్యంత ప్రమాద భరిత స్థలంగా అక్కడ సహాయక చర్యలు చేపట్టాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు పనులు అతి సూక్ష్మంగా జాగ్రత్తగా జరగాల్సి ఉంటుంది. 12 రెస్క్యూ బృందాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు నిర్వహించి అతి సున్నితంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

700 మంది సిబ్బంది 3 షిఫ్ట్‌లలో...

ఎస్ ఎల్ పీసీ రెస్క్యూ ఆపరేషన్ లో సింగరేణి, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ఎస్డీఆర్ ఎఫ్ దక్షిణ మధ్య రైల్వే రాట్ హోల్ మైనర్స్ రోజుకు మూడు శక్తులలో 700 మంది మిగిలిన ఆరు మంది డెడ్ బాడీలా కోసం అన్వేషణ చేస్తున్నారు. ఈ రెస్క్యూ బృందాలలో ఇప్పటివరకు ప్రధాన భూమిక పోషిస్తుంది. సింగరేణి, రాట్ హోల్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాల వారు మరింత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

దుర్వాసనను బట్టి తవ్వకాలు...

ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిన 6 మంది డెడ్ బాడీల కోసం జరుగుతున్న తవ్వకాలు.. ప్రధానంగా సొరంగంలో దుర్వాసన వెదజల్లుతున్న నేపథ్యంలో ఆ ప్రదేశాలలో తవ్వకాలను చేపడుతున్నారు. దుర్వాసన మరింత వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ ఆ పరిస్థితిని అధిగమిస్తూ ఉన్నతాధికారుల సూచనలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది. ఈ సహాయక చర్యలను రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా లు పర్యవేక్షణ చేస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు.

Next Story