- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కారును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

దిశ,సత్తుపల్లి : కారు ను ఢీకొని వ్యక్తి కి తీవ్రంగా గాయపడిన సంఘటన సత్తుపల్లి పట్టణం లో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, సత్తుపల్లి పట్టణ శివారులో జ్యోతి నిలయం ఎదురుగా ఉన్న హోటల్ సమీపంలో కారు పార్క్ చేసి ఉండగా, తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన అద్దంకి రాము (32) టూ వీలర్ పై తల్లాడ నుంచి సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి వెళుతుండగా జ్యోతి నిలయం ఎదురుగా హోటల్ సమీపంలో కారు రివర్స్ లో వెనుకకు వస్తుండగా అద్దంకి రాము కారును బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ సంఘటన పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య నీలిమ ఉన్నారు.