భక్తి శ్రద్ధలతో రంజాన్.. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..

by Sumithra |
భక్తి శ్రద్ధలతో రంజాన్.. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్న పెద్దలు పరస్పరం అలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రం బస్టాండ్ ఏరియా కబ్రస్తాన్, క్వారీ ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులతో ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ముస్లింలు ఉపవాస దీక్షను చేయడం ప్రత్యేకతను చాటుతుందన్నారు. రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు.

బెల్లంపల్లిలో...

బెల్లంపల్లి పట్టణంలో మార్కెట్, బాపు క్యాంపు, అశోక్ నగర్ ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసుకుని ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల.మల్లయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి.స్వామి, నియోజకవర్గం అధ్యక్షుడు సన్నీ.బాబు, మాజీ కౌన్సిలర్ బండి.ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story

Most Viewed