- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు.. వారిపై అనుమానంతో రెచ్చిపోయిన CM

దిశ, వెబ్‌డెస్క్: నాగ్‌పూర్ అల్లర్ల(Nagpur Violence)పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(CM Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని.. అల్లర్ల వెనుక ఎవరున్నా వదలబోమని హెచ్చరించారు. వారి నుంచే జరిగిన ఆస్తి నష్టాన్ని మొత్తం వసూలు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డులను పరిశీలించి 104 మంది నిందితులను గుర్తించామని, 92 మందిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని సీఎం తెలిపారు. వీరిలో 12 మంది మైనర్లు కూడా ఉన్నారని చెప్పారు. ఈ హింసను పథకం ప్రకారమే చేశారని హాట్ కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు(Mughal Emperor Aurangzeb)పై ప్రజలు కోపం పెంచుకోవడానికి కారణం.. మొన్న ఛావా సినిమానే అని కుండబద్దలు కొట్టారు. అలాగే మహారాష్ట్ర ప్రజలంతా సహనంగా ఉండి.. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని కోరారు. కాగా, ఈనెల 17వ తేదీన నాగపూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన విషయం తెలిసిందే. మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు సమాధిని తొలగించాలంటూ కొందరు ప్రజలు చేస్తున్న గొడవ దేశ వ్యాప్తంగా చర్చకు కారణం అవుతుంది. నేరుగా ప్రభుత్వానికి ఔరంగజేబు(Aurangzeb) సమాధి తొలగించాలంటూ హిందూ సంఘాలు లేఖ రాశాయి. దీంతో మహారాష్ట్ర సర్కారు అక్కడ భద్రతను పెంచగా.. సోమవారం సాయంత్రం కొందరు నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి.