- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టాక్ ట్రేడింగ్ లో మా టిప్స్ అందుకోండి అంటూ బురిడీ.. వ్యక్తి అరెస్ట్

దిశ, సిటీక్రైం : స్టాక్ ట్రేడింగ్ లో మా టిప్స్ ను తీసుకుని కోట్లాది రూపాయాలను సంపాదించండి అంటూ బురిడీ కొట్టిస్తున్న సైబర్ క్రైం ముఠాకు బ్యాంక్ ఖాతాలను కమిషన్ మీద అందిస్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తిని శనివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కమిషన్ మీద ఇచ్చిన ఖాతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ 6 కోట్ల లావాదేవిలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యాపారీకి టెలిగ్రాం యాప్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు పరిచయమయ్యారు. తమ యాప్ అప్లికేషన్స్ ద్వారా ఇచ్చే టిప్స్ ను పాటించి మీరు కోట్లాది రూపాయాలు సంపాదించండంటూ మాయ చేశారు. ఇలా వారి మాటలకు బోల్తాపడి వ్యాపారి 1.22 కోట్లు డిపాజిట్ చేశాడు.
ఈ పెట్టుబడికి అతనికి కేటాయించిన ఐడీలో 10 రేట్లు అధిక ఆదాయం వచ్చినట్లు చూపించింది. విత్ డ్రా కు ప్రయత్నిస్తే ఇంకా డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే మా అప్లికేషన్ నుంచి మీరు డిలీట్ అయిపోతారని బెదిరించి భయపెట్టారు. దీంతో ఇది మోసమని గ్రహించి వ్యాపారి గత ఏడాది చివర్లో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు బాధితుడి నుంచి డబ్బులు బదిలీ అయిన ఖాతాలను జల్లెడ పట్టి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అంకిత్ అరోరాను అరెస్టు చేశారు. విచారణలో ఈ చీటింగ్ కు పాల్పడింది దీపక్ కుమార్ అని తెలిసింది. అతనికి అంకిత్ బ్యాంక్ ఖాతలను కమీషన్ ల మీద ఇచ్చాడని నిర్ధారణ అయ్యింది. ఇలా అంకిత్ ఇచ్చిన బ్యాంక్ ఖాతాల్లో మొత్తం 6 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీపక్ కుమార్ ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో ఉన్నట్లు విచారణలో పోలీసులకు తెలిసింది.