North korea: రష్యాకు ఉత్తర కొరియా మద్దతు.. ప్రకటించిన కిమ్

by vinod kumar |
North korea: రష్యాకు ఉత్తర కొరియా మద్దతు.. ప్రకటించిన కిమ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (kim jong Un) కీలక ప్రకటన చేశారు. యుద్ధంలో ఎల్లప్పుడూ తమ మద్దతు రష్యాకే ఉంటుందని ప్రకటించారు. రష్యా భద్రతా అధికారితో ప్యాంగ్యాంగ్‌లో తాజాగా జరిగిన సమావేశంలో కిమ్ ఈ ప్రకటన చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. జాతీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, భద్రతా ప్రయోజనాలను కాపాడుకునే పోరాటంలో రష్యాకు తన ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అలాగే ప్రస్తుతం యుద్ధ పరిస్థితి, ట్రంప్ తో రష్యా చర్చలు వంటి విషయాలపైనా కిమ్ చర్చించారు. భద్రతతో సహా వివిధ రంగాల్లో రష్యా, ఉత్తరకొరియా మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపైనా కిమ్ డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా తన దళాలకు భారీ ప్రాణనష్టం జరిగిన తర్వాత రష్యాకు అదనపు దళాలను పంపే అవకాశం ఉందని దక్షిణ కొరియా (South korea) ఇంటలిజెన్స్ ఇటీవల అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే కిమ్ రష్యా భద్రతా అధికారితో సమావేశం అవ్వడం గమనార్హం. కాగా, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించడగా పుతిన్‌తో చర్చలు జరుగుతున్నాయి.

Next Story

Most Viewed