- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈవీయంలు అత్యంత సురక్షితమైనవి
దిశ, నారాయణపేట ప్రతినిధి: భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీయంలు అత్యంత సురక్షితమైనవిగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చినట్లు కలెక్టర్ సిక్త పట్నాయక్ ప్రకటనలో తెలిపారు. ఈవియంలను ట్యాంపరింగ్ చేయొచ్చని పేర్కొంటూ మళ్ళీ బ్యాలెట్ పేపర్లకు అమల్లోకి తేవాలని కోరుతూ కొందరు వ్యక్తులు ఇటీవల సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని, పీల్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును కొట్టి వేస్తున్నట్టు తీర్పు వచ్చిందన్నారు. నాయకులు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అని చెప్పడం, ఓటమి పాలైనప్పుడు మాత్రం ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తపరచడం సరికాదని న్యాయస్థానం పేర్కొన్నట్లు తెలిపారు. ఈ తీర్పు ఈవీఎంల విశ్వాసనీయతకు మద్దతుగా, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందనడానికి రుజువుగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్లు అందరూ రాబోయే రోజులో ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించే ఎన్నికలలో చురుకుగా పాల్గొనాలని ఆమె కోరారు.