- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bajrang punia: అలా చేస్తే సస్పెన్షన్ ఎత్తేస్తారేమో.. బజరంగ్ పునియా సంచలన వ్యాఖ్యలు..
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్స్ కాంస్య పతాక విజేత బజరంగ్ పునియాపై నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నాలుగేళ్ల నిషేధం విధించింది. డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినందుకు పునియాపై వేటు పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ వేటు అమలులో ఉంటుందని నాడా పేర్కొంది. దీంతో ఏప్రిల్ 22, 2028 వరకు పునియాపై నిషేధం ఉండనుంది. దీంతో బజరంగ్ రెజ్లింగ్‌లో పోటీ పడేందుకు, విదేశాల్లో కోచింగ్ విధులు నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకోవడానికి సైతం వీలు ఉండదు.
నాడా యాక్షన్స్‌కు కారణమిదే..!
మార్చి10న పునియా జాతీయ జట్టు సెలక్షన్ ట్రయల్స్‌కు శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఇందుకు గాను నాడా పునియాపై ఏప్రిల్ 23న సస్పెషన్ వేటు వేసింది. తర్వాత యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ సైతం పునియాపై నిషేధం విధించింది. శాంపిల్స్ ఇవ్వడానికి బజరంగ్ ఎందుకు నిరాకరించాడో తెలపాలని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నాడాకు ఆదేశాలు జారీ చేసింది. నాడా పునియాకు 26లోపు తన వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఇందుకు పునియా స్పందించకపోవడంతో.. మే 7లోగా వివరణ ఇవ్వాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సైతం పునియా సమాధానం ఇవ్వలేదు. ఈ ఏడాది మేలో నాడా అతనిపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. పునియా తనపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ యాంటీ-డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్‌కు వెళ్లాడు. దీంతో మే 31న ప్యానెల్ సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేసింది.ఈ ప్యానెల్ సెప్టెంబర్20, అక్టోబర్4న పునియా ఇష్యూపై సమగ్ర విచారణ చేపట్టింది. పునియా డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్యానెల్ గుర్తించి.. సస్పెన్షన్ వేటును కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
టెస్టింగ్ కిట్‌లపై పునియా అభ్యంతరం
శాంపిల్స్ ఇవ్వడానికి తాను ఎన్నడూ నిరాకరించలేదని పునియా అన్నాడు. డిసెంబర్ 23న శాంపిల్స్ కోసం పంపిన టెస్టింగ్ కిట్‌ల గడువు ముగిసిందని పునియా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ అంశంలో నాడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నాడా మాత్రం తన చర్యను సమర్ధించుకుంది. టెస్ట్ కోసం పునియా మూత్ర నమునా ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పునియా మాత్రం నాడా నుంచి గడువు ముగిసిన టెస్టింగ్ కిట్‌లప్ సరైన సమాధానం వచ్చాకే శాంపిల్స్ ఇస్తానని తేల్చి చెప్పాడు.
బీజేపీలో చేరితే నిషేధం ఎత్తేస్తారేమో..
నాడా విధించిన నాలుగేళ్ల నిషేధంపై బజరంగ్ పునియా స్పందించారు. బీజేపీలో చేరితే తనపై నిషేధాన్ని ఎత్తేస్తారని అన్నాడు. నిషేధం తనకు షాక్‌కు గురిచేయలేదని పునియా తెలిపాడు. శాంపిల్ ఇచ్చేందుకు తాను తిరస్కరించలేదని.. కానీ నా ఇంటికి డోప్ టెస్ట్ కోసం వచ్చినప్పుడు గడువు ముగిసిన కిట్లను తీసుకువచ్చారని అన్నారు. ఆ కిట్‌లను సైతం తాను సోషల్ మీడియాలో ఉంచినట్లు క్లారిటీ ఇచ్చాడు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఉన్నందుకే తనపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని భావిస్తున్నట్లు స్పష్టం చేశాడు. కేంద్రం అన్ని ఏజెన్సీలను తన గుప్పిట్లో ఉంచుకుని ఈ చర్యలకు పాల్పడుతోందన్నాడు. 10-12ఏళ్లుగా రెజ్లింగ్‌లోపోటీలో పడుతున్నాను. అనేక మార్లు శాంపిల్స్ ఇచ్చాను. ప్రభుత్వం మమ్మల్ని విడగొట్టి వారి ఎదుట తలవంచేలా చేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. తాను బీజేపీలో చేరితో అన్ని నిషేధాలు ఎత్తేస్తారని పునియా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.