- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నిత్యం ఫుడ్ పాయిజన్ జరిగి అమాయక విద్యార్థులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ వరుస ఘటనలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఆ ప్రకటనలో " రాష్ట్రంలో గురుకులాలు, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టింది. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణించారు. రేవంత్ పాలనలో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పాలన గాలికొదిలేసిన ముఖ్యమంత్రి నేరపూరిత నిర్లక్ష్యంతో విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకు సమయం సరిపోతలేదు. విద్యార్థులు చనిపోతున్న ఒక్క సమీక్ష కూడా నిర్వహించనీ ప్రభుత్వానికి ఉసురు తప్పదు. గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ నెల 30 వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట కార్యక్రమం కొనసాగనుందని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ నివేదికను పార్టీకి సమర్పిస్తుందని.. ఈ నివేదిక అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని పత్రికా ప్రకటనలో తెలిపారు.