- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trisha: నా కెరీర్‌లో నేను ఎక్కవగా కష్టపడింది ఆ సినిమాకే.. త్రిష కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: హీరోయిన్ త్రిష (Trisha) సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళ అవార్డుల ఈవెంట్‌కి తన తల్లితో హాజరైన త్రిష.. వర్షం (Varsham) మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Interesting comments) చేసింది. స్టేజ్‌పై త్రిష అవార్డు చేత పట్టుకుని ఉండగా.. యాంకర్ త్రిష్ అమ్మను అడుగుతూ.. ‘త్రిష కెరీర్‌లో చాలా కష్టపడిన మూవీ ఏది’ అని ప్రశ్నిస్తుంది. దీనిపై స్పందించిన త్రిష తల్లి ఉమ కృష్ణన్ మాట్లాడుతూ.. ‘త్రిష తన కెరీర్‌లో ‘వర్షం’ సినిమా కోసం చాలా కష్టపడింది. ఏకంగా 45 రోజులు వర్షంలోనే గడిపాం. ఇదంతా ఎందుకు సినిమా మానేసి చెన్నైకి వెళిపోదాం అనుకున్నాం. కానీ ధైర్యంతో ముందుకు వెళ్లాం. కానీ, ఈ సినిమా రిలీజ్ అయ్యాక మేము పడ్డా కష్టం మొత్తం మర్చిపోయాం’ అని చెప్పుకొచ్చారు. ఇక దీనిపై త్రిష కూడా స్పందిస్తూ.. ‘‘వర్షం’ మూవీ కోసం నేను చాలా కష్టపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ప్రభాస్ (Prabhas), త్రిష జంటగా నటించిన ‘వర్షం’ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాంగే.. ప్రభాస్ అండ్ త్రిష స్టార్ స్టేటస్‌ను సొంతం చేసింది.