- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google: భారత స్మార్ట్‌ఫోన్ విభాగం హెడ్‌గా మాజీ యాపిల్ ఉద్యోగిని నియమించిన గూగుల్
దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం గూగుల్ తన స్మార్ట్‌ఫోన్ వ్యాపారం పిక్సెల్ తయారీ, సేవల విభాగం బాధ్యతలను యాపిల్ ఇండియా మాజీ కన్స్యూమర్ సేల్స్ ఉద్యోగి మితుల్ షాకు అప్పగించింది. ప్రధానంగా గూగుల్ పరికరాలు, సేవలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా మితుల్ షా వ్యవహరించనున్నారు. దేశీయంగా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలతో పాటు వ్యాపార విస్తరణపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త డివైజ్‌ల తయారీ, ఇన్నోవేషన్‌లో అంతర్జాతీయంగా ముందంజలో ఉన్న గూగుల్ కంపెనీలో భాగం కావడంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం అందరి చేతుల్లో అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని మితుల్ షా ఓ ప్రకటనలో తెలిపారు. గూగుల్ సంస్థ దేశీయంగా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని తన పిక్సెల్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే మితుల్ షాను నియమించింది.