పంటలు నాశనం చేస్తున్నాయ్ బాబోయ్.. స్పందించండి: దిగువూరు రైతులు

by srinivas |
పంటలు నాశనం చేస్తున్నాయ్ బాబోయ్.. స్పందించండి: దిగువూరు రైతులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District) చినగొట్టిగళ్లు మండలం దిగువూరులో ఏనుగుల(Elephants) గుంపు హల్ చల్ చేసింది. కోతకు వచ్చిన చెరుకు(sugar cane) తోటల్లో బీభత్సం సృష్టించాయి. దిగువూరుకు సమీపంలో తిష్ట వేసిన 10కి పైగా ఏనుగులు.. చెరుకు, వరి, టమాటా తోటలను ధ్వంసం చేశాయి. పగలు అడవుల్లో ఉంటూ రాత్రి వేళ్లల్లో పంటలు, తోటలు నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు(Farmers) ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంటలను ఏనుగులు పాడు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను అడవుల్లోకి తరిమివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏనుగులు తమ పొలాల్లోకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed