ప్రపంచ స్థాయి కరాటే పోటీల్లో న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థుల ప్రతిభ

by Sridhar Babu |
ప్రపంచ స్థాయి కరాటే పోటీల్లో న్యూ లిటిల్ ఫ్లవర్  విద్యార్థుల ప్రతిభ
X

దిశ, వైరా : ప్రపంచ స్థాయి కరాటే పోటీల్లో వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. ప్రపంచ స్థాయిలో బంగారు, వెండి పథకాలను ఈ పాఠశాల విద్యార్థులు సాధించి వైరా మండల కీర్తి ప్రతిష్టలను నలుదిక్కులా చాటి చెప్పారు. గత వారం రోజుల క్రితం గోవాలో ఎఫ్ఎస్కేఏ కరాటే వరల్డ్ కప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి కె.శ్రీమన్నారాయణ ఎబో 14 ఇయర్స్ విభాగంలో 50 కేజీల కట పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. అదే విధంగా 9వ తరగతికి చెందిన మరో విద్యార్థి రేవంత్ 45 కేజీల కట విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.

అండర్ 12 ఇయర్స్ విభాగంలో ఏడో తరగతి విద్యార్థి భాను ప్రసాద్ 35 కేజీల కట విభాగంలో వెండి పతకాన్ని సాధించాడు. కరాటేలో ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులను బుధవారం వైరా ఏసీపీ రెహమాన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ రెహమాన్ మాట్లాడుతూ న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు కరాటే పోటీల్లో ప్రపంచ స్థాయి బహుమతులు సాధించటం వైరాకే గర్వకారణమన్నారు. ఈ పాఠశాల విద్యార్థులు విద్యతోపాటు ఆటలు, కరాటే పోటీల్లో తమ ప్రతిభను కనబరచడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఈ పాఠశాల విద్యార్థులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్ కుర్రా సుమన్, ప్రిన్సిపాల్ షాజీ మ్యాథ్యూ, ఏఓ సామినేని నరసింహారావు, కరాటే మాస్టర్ మహబూబ్ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story