- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
47 వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు(పోస్ట్)
దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో మరికొన్ని చిత్రాల్లో కమెడియన్‌గా నటించి మెప్పించాడు. అయితే ఈయన సినిమా ఇండస్ట్రీలోకి అనుకోకుండా అడుగు పెట్టాడు. సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర పర్సనల్ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన అతను అనుకోకుండా డైరెక్టర్ దగ్గరే పర్సనల్ అసిస్టెంట్‌గా చేరాడు. మొదట ‘ఖడ్గం’ సినిమాలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుబ్బరాజు.. ఆ తర్వాత ఆర్య, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, సాంబ, భద్ర, పౌర్ణమి, స్టాలిన్, దేశముదురు, అతిథి, తులసి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, బిల్లా, ఖలేజా, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, లీడర్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఈయన కేవలం తెలుగులో కాకుండా తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కూడా సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో ఈయనకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటుడు సుబ్బరాజు తన 47 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఈ మేరకు తన భార్యతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హిట్చడ్ ఫైనల్లీ అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం సుబ్బరాజు మ్యారేజ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ న్యూ కపుల్‌కి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.