Seethakka: మిషన్ భగీరథపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

by Prasad Jukanti |
Seethakka: మిషన్ భగీరథపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలు ఆర్వో ప్లాంట్లు, బోర్ నీళ్లపై ఆధారపడకుండా చూడాలని మంత్రి సీతక్క (Seethakka) అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ (Mission Bhagiratha Scheme) నీళ్ల నాణ్యతను ప్రజలకు వివరించేలా సదస్సులు నిర్వహించాలని, విధిగా మిషన్ భగీరథ నీళ్లను వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన మిషన్ భగీరథ బోర్డు సమావేశం (Bhagiratha Board meeting) జరిగింది. ఈ సమావేశానికి పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed