Prithvi Shah: కెరీర్ మొత్తం నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.. పృథ్వీ షా సంచలన వీడియో విడుదల

by Shiva |
Prithvi Shah: కెరీర్ మొత్తం నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.. పృథ్వీ షా సంచలన వీడియో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia)లోని జెడ్డా (Jeddah) వేదికగా జరిగిన ఐపీల్ మెగా వేలం-2024 (IPL Mega Auction-2024) ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు పోటీపోటీగా ఆక్షన్‌లో తలపడ్డాయి. అయితే, వేలంలో భారత సీనియర్ ఆటగాళ్లకు బిగ్ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా (Prithvi Shah) అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచిపోయాడు. ఈ క్రమంలోనే అతడు సోషల్ మీడియా (Social Media)లో సంచలన వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో పృథ్వీ షా మాట్లాడుతూ.. ఐపీఎల్‌ ఆక్షన్‌ (IPL Auctions)లో తాను అమ్ముడుపోని కారణంగా తనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ జరుగుతోందని అన్నాడు. కెరీర్‌ మొత్తం తనను ట్రోలింగ్ (Trolling) చేస్తూనే ఉన్నారని.. తాను కూడా మీమ్స్‌ను చూస్తూనే ఉంటానని వెల్లడించాడు. ‘ట్రోలింగ్‌ అనేది మంచిది కాదు.. అలాగని చెడ్డ విషయమూ కాదు. ఏం చేసినా తప్పుబట్టేవాళ్లు ఉంటారని మాత్రం అర్థం చేసుకున్నా. తప్పు లేదని తెలిస్తే.. దానిని అందరికీ కనిపించేలా చేయాలి’ అంటూ పృథ్వీ షా అన్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా (Social Media)లో తెగ చక్కర్లు కొడుతోంది.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story