కులగణనపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. తొలిసారి స్పందించిన TPCC చీఫ్

by Gantepaka Srikanth |
కులగణనపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. తొలిసారి స్పందించిన TPCC చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: శాసనమండలి(Telangana Legislative Council)లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. బీసీ కుల‌గ‌ణ‌న(BC Caste Census) స‌ర్వే చారిత్రాత్మకం అని అన్నారు. బీసీ కుల‌గ‌ణ‌న‌తో రాహుల్ గాంధీ ఆశ‌యం నెర‌వేరిందని తెలిపారు. దేశంలో ఫ‌స్ట్ టైం కుల‌గ‌ణ‌నను తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టి పూర్తి చేసిందని ప్రకటించారు. తెలంగాణ చరిత్రలో కుల గణన సర్వే సరికొత్త అధ్యాయమని అన్నారు. తెలంగాణలో బీసీలు 50 శాతం పైగా ఉన్నారని కుల సర్వేతో వెలుగులోకి వచ్చిందని చెప్పారు. కీలక సమావేశాలకు అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్‌(KCR)కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని అడిగారు. మండలి కౌన్సిల్ నుంచి బీఆర్ఎస్ నేతల వాకౌట్‌తో బీసీల పట్ల చిత్తశుద్ధి ఏంటో తేలిపోయిందని విమర్శించారు.

బీఆర్ఎస్(BRS) పార్టీకి బీసీని పార్టీ అధ్యక్షుడిగా నియమించే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ కులగణన సర్వేను పూర్తి చేసిందని అన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. స్థానిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్‌లో కేటీఆర్- కవిత- హరీష్ మధ్య కోల్ వార్ మొదలైందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మూడు ముక్కలాట ముగిశాకే మిగిలిన వాటిపై వారు మాట్లాడుతారని అన్నారు.

సోషల్ మీడియాలో కేటీఆర్(KTR) - కవిత(Kavitha) అనుచరుల సోషల్ వార్ నడుస్తోంది. కులగణనపై శాసనమండలిలో జరిగే చర్చలో కవిత మాట్లాడకుండా కేటీఆర్ పకడ్బందీ స్కెచ్ వేశాడు. కవితే కాదు.. హరీష్ రావు కూడా ఆ అంశంపై మాట్లాడలేదు. దేశంలో ఫ‌స్ట్ టైం కుల‌గ‌ణ‌నను తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టి పూర్తి చేసింది. ప్రశంసించాల్సింది పోయి.. విమర్శలు చేయడం దారుణమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక బీసీ కులగణనపై తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తుందని అన్నారు. తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Next Story