YS Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణపై హైకోర్టులో పిటిషన్

by M.Rajitha |
YS Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణపై హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ వివేకా హత్య కేసు(YS Vivekananda Murder Case) విచారణపై శుక్రవారం ఏపీ హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలైంది. వివేకా కుమార్తె సునీత ఈ పిటిషన్ వేశారు. ఈ కేసులో నిందితులతోపాటు, సీబీఐ(CBI)ని కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై విచారణ నేడు కోర్టులో విచారణ జరిగింది. ఆరేళ్ళ క్రితం హత్య జరగగా.. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చెప్పుకోదగిన పురోగతి లేదన్నారు. 2019 మార్చ్ 14 అర్థరాత్రి ఈ హత్య జరిగిందని.. అనంతరం గత ప్రభుత్వం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి విచారణ సీబీఐకి మారింది గాని, ఎలాంటి ఫలితం లేదన్నారు.

ఇకపై ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో రోజూ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అలాగే విచారణను 6 నెలల్లో ముగించేలా ఆదేశించాలని కోరారు. ఈకేసులో దాఖలు చేసిన చార్జ్ షీట్స్ కాపీలను హార్డ్ డిస్క్ లో అందించారని, అయితే ఈ హార్డ్ డిస్క్ ఓపెన్ కావడం లేనందున.. 15 నెలలుగా విచారణ పెండింగ్ లోనే ఉందని సునీత తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్ట్.

Next Story