Tirumala: తిరుమలపై తుపాన్ ఎఫెక్ట్.. భక్తుల రద్దీ ఎలా ఉందంటే

by Rani Yarlagadda |   ( Updated:2024-11-27 05:39:07.0  )
Tirumala: తిరుమలపై తుపాన్ ఎఫెక్ట్.. భక్తుల రద్దీ ఎలా ఉందంటే
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ లో భక్తులు వేచి ఉండగా.. టోకెన్ లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని చెప్పారు. టైమ్ స్లాట్ దర్శనానికి 2 గంటలు, రూ.300 దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. నిన్న శ్రీవారిని 65,525మంది భక్తులు దర్శించుకోగా.. 19,880 మంది భక్తులు తలనీనాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇటు ఆంధ్ర, అటు తమిళనాడుకు తుపాను (Cyclone Fengal) ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కరుస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులంతా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడంతోనే రద్దీ తగ్గినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story