BIG News: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. కాంగ్రెస్ సీనియర్ నేత కారుపై రాళ్ల దాడి!

by Shiva |   ( Updated:2024-11-27 03:15:27.0  )
BIG News: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. కాంగ్రెస్ సీనియర్ నేత కారుపై రాళ్ల దాడి!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు (V Hanumanth Rao) కారుపై దుండగులు బుధవారం తెల్లవారుజామున రాళ్ల దాడికి తెగబడ్డారు. అంబర్‌పేట్‌లోని తన ఇంటి ఎదుట పార్క్ చేసిన కారుపై పెద్ద బండ రాళ్లతో దాడి జరిగింది. దీంతో సీరియస్ అయిన వీహెచ్ నేరుగా అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌ (Amberpet Police Station)కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల (CC Cameras) ఆధారంగా కారును ధ్వంసం ఎవరు చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed