సీఎస్కే కోచ్‌లకు ఆ దమ్ము లేదు.. ధోనీ నిర్ణయమే ఫైనల్ : మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు

by Harish |
సీఎస్కే కోచ్‌లకు ఆ దమ్ము లేదు.. ధోనీ నిర్ణయమే ఫైనల్ : మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : చెపాక్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఛేదనలో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఆకట్టుకున్నాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 30 రన్స్ చేశాడు. అయితే, అప్పటికే సీఎస్కే ఓటమి ఖరారవ్వగా.. ధోనీ మెరుపులు ఫలించలేదు. ఈ క్రమంలో ధోనీ బ్యాటింగ్ స్థానంపై చర్చ జరుగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో అతను ముందుగా రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు.

ధోనీ అనుభవం అవసరమైన సమయంలో అతన్ని ముందుకు పంపించేందుకు సీఎస్కే మేనేజ్‌మెంట్ వెనకాడటాన్ని తప్పుబట్టాడు. ధోనీని ముందుగా రావాలని చెప్పే దమ్ము సీఎస్కే కోచ్‌లకు లేదని ఘాటుగా విమర్శించాడు. ‘16 బంతుల్లో 30 పరుగులు చేసే ధోనీలాంటి బ్యాటర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా ఎందుకు పంపించడం లేదో అర్థం కావడలేదు. మీరు గెలవడానికే ఆడుతున్నారు కదా?. ధోనీ ముందుగా పంపించాలని చెప్పే దమ్ము కోచ్‌లకు లేదు. అతని నిర్ణయమే ఫైనల్.’ అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు. అదే ఇంటర్యూలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. తివారీకి కౌంటర్ ఇచ్చాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ధోనీ ముందుగా వచ్చినా ఫలితం ఉండేదని కాదని వ్యాఖ్యానించాడు. ‘ధోనీ నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే బంతులు ఆడతాడు. 17వ, 18వ ఓవర్లలో అతను బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో కూడా అలాగే వచ్చాడు. నేనేం ఆశ్చర్యపోలేదు’ అని చెప్పుకొచ్చాడు.



👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed