ఆ విషయం నన్ను ఎంతగానో బాధించిందంటూ చియాన్ విక్రమ్ ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?

by Hamsa |
ఆ విషయం నన్ను ఎంతగానో బాధించిందంటూ చియాన్ విక్రమ్ ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ విడుదల కావడం లేదు. పలు సమస్యలు ఎదుర్కొంటూ వాయిదాలు పడుతూ వస్తుండటంతో ఆయన కెరీర్‌పై ప్రభావం పడుతోంది. ఇటీవల విక్రమ్ ‘వీర ధీర శూరన్-2’ (Veera Dheera Sooran)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శింబు(Riya Simbu) నిర్మించగా.. దుషార విజయన్(Dushara Vijayan) హీరోయిన్‌గా నటించింది. అరుణ్‌కుమార్(Arun Kumar) దర్శకత్వం వహించిన ఈ సినిమా పలు వాయిదా మధ్య మార్చి 27న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ పలు లీగల్ సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

దీంతో నాలుగు వారాలపాటు వాయిదా పడింది. ఆ తర్వాత అన్ని సర్దుమనగడంతో మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో.. తాజాగా, విక్రమ్ ‘వీర ధీర శూరన్-2’ సక్సెస్ కావడంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ‘‘ వీర ధీర శూరన్-2 మాకు చాలా ప్రత్యేకమైన సినిమా. మా చిత్రాన్ని ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు మేము దీనిని సినీ ప్రముఖులు, కొంతమంది అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాం.

చూసిన వారంతా చాలా బాగుందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఇది బిగ్గెస్ట్ హిట్ మూవీ అవుతుందని అన్నారు. వారి మాటలతో మేము ఎంతగానో ఈ సినిమాపై నమ్మకాలు పెట్టుకున్నాం. తీరా చూస్తే విడుదలకు ముందు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంది. దీంతో నాలుగు వారాలపాటు రిలీజ్ వాడియా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే విడుదల రోజు చాలా షోస్ క్యాన్సిల్ అయ్యాయి. అది ఎంతగానో బాధించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అభిమానుల కోసం శ్రమించి.. ఎలాగైనా ఈ సినిమాని బయటకు తీసుకురావాలనిపించింది. చాలా కష్టపడి రిలీజ్ చేశాం. ఈవెనింగ్ షోస్ నుంచి మా సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఆనాటి నుంచి అభిమానులు, సినీ ప్రియులు దీనిపై విశేష ఆదరణ కనబరుస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed