- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైదరాబాద్ వాసులకు సూపర్ గుడ్ న్యూస్.. మెట్రో ప్రయాణ వేళల పొడిగింపు

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాసులకు మెట్రో సూపర్ న్యూస్ (Super News) ను తీసుకొచ్చింది. మెట్రో ప్రయాణ వేళలను పొడిగిస్తున్నట్లు (Metro Timings Extended) హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రకటించింది. హైదరాబాద్ లో మెట్రో సేవలు మొదలైన నాటి నుంచి పట్టణంలో నివసిస్తున్న వారు ట్రాఫిక్ అంతరాయం నుంచి భారీ ఉపశమనం పొందారు. గతంలో హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లాలన్నా బస్సుల్లోనో, సొంత వాహానాల్లోనో వెళుతూ ట్రాఫిక్ అంతరాయంతో సమయానికి చేరుకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడేవారు. మెట్రో వచ్చిన నాటి నుంచి ఆ ఇబ్బందులకు చెక్ పెట్టినట్టు అయ్యింది. ప్రస్తుతం మెట్రో ప్రయాణ సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ సేవలను మరింత సమయం పెంచాలని పలువురి నుంచి ప్రతిపాధనలు వచ్చాయి.
దీంతో ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి (Metro MD NVS Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ప్రయాణ సేవలను రాత్రి 11.45 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి మెట్రోలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రయాణికులకు ఈ సేవలను సోమవారం నుంచి శుక్రవారం వరకు అమలులో ఉండనున్నాయని వెల్లడించారు. ఇక టెర్మినల్ స్టేషన్ (Terminal Stations) ల నుంచి ఆదివారాలు మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతాయని సమాచారం ఇచ్చారు. వీటితో పాటు ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ (Super Saver Holiday Offer) మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆఫర్ ను మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థులు 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు ప్రయాణించడానికి అవకాశం ఉంది.