ఆకతాయిల ఆట కట్టించిన పోలీసులు..

by Sumithra |
ఆకతాయిల ఆట కట్టించిన పోలీసులు..
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : బుల్లెట్ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అదనపు సైలెన్సర్ లను బిగించి శబ్ద కాలుష్యం చేస్తున్న ఆకతాయిలను కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో ట్రాఫిక్ ఏసీపి స్వామి పర్యవేక్షణలో.. భారీ శబ్దాలతో పాటు సైలెన్సర్ నుంచి ఫైర్ వెలువడుతూ వాహనదారులకు, బాటసారులకు ఇబ్బందులకు గురి చేస్తున్న రెండు బుల్లెట్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా, ఇతరులకు ఇబ్బందులు కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. ట్రాఫిక్ సీఐ, పర్ష రమేష్, ఎస్సై ఇషాక్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed