- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్‌ఆర్ ఆంజనేయులు (Anjaneyulu) మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే.. ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)ని అక్రమ అరెస్ట్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించినది. ఆంజనేయులు.. జనవరి 31, 2024న, ఎఫ్‌ఐఆర్ దాఖలు కాకముందే.. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నిలను ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశానికి పిలిచి, కాదంబరి అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 2న ఎఫ్‌ఐఆర్ దాఖలైన కొన్ని గంటల్లోనే కాదంబరి, ఆమె తల్లిదండ్రులను ముంబై నుంచి అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు.
వారు 42 రోజులపాటు న్యాయస్థాన రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె కూటమి ప్రభుత్వం హయాంలో పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దోషులు ఎంతటివారైనా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చి.. కేసును సీఐడీ అప్పగించింది. కాగా ప్రస్తుతం పిఎస్‌ఆర్ ఆంజనేయులు కోర్టు రిమాండులో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనపై మరో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రధాన పరీక్ష (APPSC Group-1 Main Exam) జవాబు పత్రాల మూల్యాంకనం లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం పై ఫిర్యాదు రావడంతో పీఎస్సార్ పై 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుత రిమాండ్ పూర్తవ్వగానే.. ఈ కేసులో ఆయన్ను మరోసారి రిమాండ్ లోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది.